schedule Saturday, November 21, 2026

హెచ్‌ఐవీ, లైంగిక వ్యాధుల నివారణపై అవగాహన

calendar_today November 21, 2026
person dharshininews
హెచ్‌ఐవీ, లైంగిక వ్యాధుల నివారణపై అవగాహన
హెచ్‌ఐవీ, లైంగిక వ్యాధుల నివారణపై అవగాహన - పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ కార్యక్రమం - ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి: హెచ్‌ఐవీ, లైంగికంగా సంక్రమించే వ్యాధుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో స్థానిక పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీపై అవగాహన, నివారణ చర్యలు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాముఖ్యతపై చర్చించారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ చలమల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావం, లక్ష్యాలు, సామాజిక సేవలో వాలంటీర్ల పాత్ర గురించి వివరించారు. విద్యార్థులు హెచ్‌ఐవీపై సరైన అవగాహన కలిగి ఉండాలని, వ్యాధి నివారణకు సంబంధించిన విషయాలను తెలుసుకుని సమాజంలో చైతన్యం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి పి. ఉత్తమ్‌ చంద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ స్టేట్‌ సెల్‌ ఆఫీసర్‌ నరసింహగౌడ్‌, ప్రొఫెసర్‌ కృష్ణకుమార్‌, రిసోర్స్‌ పర్సన్‌ భవాని, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రవీంద్రరెడ్డి, కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్లు, వివిధ కళాశాలల ప్రోగ్రాం ఆఫీసర్లు, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45479/