ఆర్టీసీలో ఆకట్టుకునే ఆఫర్లు..!
November 21, 2026
dharshininews
ఆర్టీసీలో ఆకట్టుకునే ఆఫర్లు..!
- తాండూరు డిపో కొత్త ప్రయత్నాలు
- మంత్లీ పాస్‌లపై రాయితీలు
- అందుబాటులో అద్దె బస్సులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు సంస్థ ఆదాయాన్ని పెంచే దిశగా తాండూరు ఆర్టీసీ డిపో ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులను ఆకర్షించేందుకు మంత్లీ సీజన్ టికెట్లపై రాయితీలు, అదనపు ప్రయోజనాలు అందిస్తోంది.
మరోవైపు శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక అద్దె బస్సులను అందుబాటులోకి తెచ్చింది. రాయితీలతో ప్రయాణికులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూనే.. బస్సుల వినియోగం, బుకింగ్‌లు పెంచి డిపో ఆదాయానికి తోడ్పడేలా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి.
మంత్లీ పాస్‌లపై ప్రత్యేక రాయితీలు
తాండూరు డిపో పరిధిలో మంత్లీ సీజన్ టికెట్ తీసుకునే ప్రయాణికులకు పలు సదుపాయాలు కల్పిస్తున్నారు. దూర పరిమితి లేకుండా పాస్‌లు జారీ చేయడంతో పాటు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, ఈ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు.
ఎంపిక చేసిన నగరాల్లో ఆదివారాలు ఉచిత ప్రయాణం, రూ.20తో కాంబి టికెట్ సదుపాయం అందుబాటులో ఉంది. సూపర్ లగ్జరీ, ఆపై కేటగిరీ బస్సుల్లో 10 శాతం రాయితీతో పాటు రెండు నెలల పాస్‌పై ఐదు రోజులు, మూడు నెలల పాస్‌పై పది రోజుల అదనపు వ్యాలిడిటీ కల్పిస్తున్నారు. మహిళలకు టోల్ ఛార్జీల్లో ప్రత్యేక రాయితీ కూడా ఉంది. ఈ ప్రయోజనాలు నిత్యం ప్రయాణించే వారికి ఖర్చు తగ్గించడంతో పాటు మంత్లీ పాస్‌ల వినియోగాన్ని పెంచే అవకాశం కల్పిస్తున్నాయి.
శబరిమల భక్తుల కోసం అద్దె బస్సులు
శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, గురుస్వాముల కోసం తాండూరు డిపో నుంచి బస్సులను అద్దెకు తీసుకునే సదుపాయం కల్పించారు. 36 సీట్ల సూపర్ లగ్జరీ (నాన్ ఏసీ) బస్సుకు కిలోమీటరుకు రూ.59, 55 సీట్ల ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.65, 40 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.57 చొప్పున ఛార్జీలు నిర్ణయించారు.
గంటకు వెయిటింగ్ ఛార్జీ రూ.300గా, గంటకు కనీస ప్రయాణ దూరం 30 కిలోమీటర్లుగా నిర్దేశించారు. గతంలో సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు రూ.65 ఉండగా ప్రస్తుతం రూ.59కు తగ్గించారు. దీంతో భక్తుల బృందాలు ఒకే బస్సులో సౌకర్యవంతంగా యాత్ర సాగించే అవకాశం ఉండటంతో పాటు అద్దె బస్సుల బుకింగ్‌ల ద్వారా డిపోకు అదనపు ఆదాయం సమకూరనుంది.
ఆదాయం పెంపు లక్ష్యం
తాండూరు డిపో అమలు చేస్తున్న ఈ సదుపాయాలు ప్రయాణికులను ఆర్టీసీ వైపు ఆకర్షించేలా ఉన్నాయి. మంత్లీ పాస్‌ల వినియోగం పెరిగితే రోజువారీ ప్రయాణాల ద్వారా క్రమబద్ధమైన ఆదాయం లభిస్తుంది.
శబరిమల వంటి యాత్రలకు అద్దె బస్సుల బుకింగ్‌లు పెరిగితే అదనపు ఆదాయానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒకవైపు రాయితీలు, మరోవైపు ప్రత్యేక బస్సుల సదుపాయాలతో ప్రయాణికులకు మేలు చేయడంతో పాటు సంస్థ ఆదాయాన్ని పెంచే దిశగా తాండూరు డిపో ప్రయత్నిస్తోంది. అద్దె బస్సుల బుకింగ్, ఇతర వివరాల కోసం 8309348157, 9959226251, 9440069253 నంబర్లను సంప్రదించాలని ఇదివరకే ప్రకటించారు.
https://www.dharshininews.com/45465/