schedule Sunday, July 05, 2026

అనుమతులు లేకుండా ఇసుక రవాణా

calendar_today January 4, 2023
person dharshininews
అనుమతులు లేకుండా ఇసుక రవాణా
అనుమతులు లేకుండా ఇసుక రవాణా - అర్థరాత్రి పట్టుకున్న పోలీసులు - డ్రైవర్, యజమానిపై కేసు నమోదు తాండూరు, దర్శని ప్రతినిధి: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్ డ్రైవర్, యజమాని అయిన నిందితున్నిపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం ఖాంజాపూర్ గ్రామానికి చెందిన మధుర ఎల్లప్ప మంగళవారం రాత్రి గ్రామ పరిధిలోని కాగ్నా వాగు నుంచి తాండూరు పట్టణం సాయిపూర్ మీదుగా ట్రాక్టర్(ఏపీ27 ఎఫ్ 9801) ద్వారా ఇసుక రవాణా చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్ ను అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి పత్రాలను అడగగ ఎలాంటి పత్రాలు లేకపోవతో ట్రాక్టర్ ను పోలీస్టేషన్ కు తరలించారు. ఈ మేరకు నిందితుడు అయిన ట్రాక్టర్ డ్రైవర్, యజమాని ఎల్లప్పపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేందర్ రెడ్డి వివరించారు.