schedule Sunday, July 05, 2026

పత్రాలు లేని వాహనాలను నడపరాదు

calendar_today December 10, 2022
person dharshininews
పత్రాలు లేని వాహనాలను నడపరాదు
పత్రాలు లేని వాహనాలను నడపరాదు - పెండింగ్‌ చలాన్లు క్లియర్ చేసుకోవాలి - తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పత్రాలు లేని, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను నడిపిస్తే చర్యలు తప్పవని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాండూరు పట్టణ పోలీష్టేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలకు సంబంధించి పెండింగ్ చలాన్లు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, లైసెన్స్, హెల్మెట్ ధరించడం వంటి వాటిపై ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. వాటికి వ్యతిరేకంగా ఉన్న వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వానదారులు పత్రాలు లేకుండా వాహనాలను నడిపితే చర్యలు తప్పవన్నారు. వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలన్నారు. నిబంధనలు పాటించకుండా రోడ్డుపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.