schedule Saturday, September 12, 2026

పెద్దేముల్ సూపరిండెంట్ చంద్రశేఖర్ కన్నుమూత

calendar_today December 10, 2022
person dharshininews
పెద్దేముల్ సూపరిండెంట్ చంద్రశేఖర్ కన్నుమూత
పెద్దేముల్ సూపరిండెంట్ చంద్రశేఖర్ కన్నుమూత - నివాసంలో తుదిశ్వాస విడిచిన అధికారి - సానుభూతి ప్రకటించిన అధికారులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండల పరి పరిషత్ కార్యాలయంలో సూపరిండెంట్ కురువ చంద్రశేఖర్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విధులకు హాజరవుతున్నారు. శనివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం వేళ ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌కు అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన మరణ వార్త తెలిసిన తోటి స్నేహితులు, అధికారులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.