schedule Sunday, September 13, 2026

సెకండ్‌ చాన్స్‌లో చలాన్లే..!

calendar_today November 4, 2022
person dharshininews
సెకండ్‌ చాన్స్‌లో చలాన్లే..!
సెకండ్‌ చాన్స్‌లో చలాన్లే..! - ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు - అందరు నిబంధనలు పాటించాలి - తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు నిబంధనలు పాటించుకుండా రెండోసారి పట్టుబడితే చలాన్ల వాత తప్పదని తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ హెచ్చరించారు. వాహనదారులు, ప్రయాణికులు ప్రయాణాల్లో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆటో, జీపు డ్రైవర్లతోపాటు టీనేజర్లు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. కోడంగల్ రోడ్డు మార్గంలో ఆటోలో, జీపుల్లో సామర్థ్యానికి మించి తరలి వెళుతున్న ప్రయాణికులను దించి ఆర్టీసీ బస్సులలో తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సమయం కన్నా ప్రాణాలు ముఖ్యమని అన్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రణ అందరి బాధ్యత అని, కావున అందరు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. ప్రయాణాలు సాగించే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటే మొదటి సారి చాన్స్‌ ఇచ్చి వదిలేసినా.. సెకండ్‌ చాన్స్‌లో అదే పునరావృతం అయితే చలాన్లు వేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో అందరు బాధ్యతగా మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.