schedule Sunday, July 05, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

calendar_today November 4, 2022
person dharshininews
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం - పకడ్బందీగా రోడ్డు నిబంధనల అమలు - సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు - అధికారుల సమీక్షలో తాండూరు డిఎస్పీ జీ. శేఖర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు శాఖ, రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని తాండూరు డీఎస్పీ జి.శేఖర్ గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా ధారూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో జి.శేఖర్ గౌడ్ పోలీసు శాఖ, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా అందరూ రోడ్డు నిబంధనలు పాటించేలా దృష్టిసారించాలన్నారు. నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అందరు వాహనాలకు సంబంధించి ఆర్టీఓ జారీ చేసిన లైసెన్స్లు, దృవపత్రాలు ఉంచుకునేలా చూడాలన్నారు. దీంతో పాటు ప్రైవేటు వాహనాలు, జీవులు, ఆటోలలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టికి సారించి.. ఇందులో అందరిని భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, రవాణా శాఖ అధికారి లావణ్య, అసిస్టెంట్ మేనేజర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.