schedule Sunday, July 05, 2026

సూట్‌కేస్‌లో మృతదేహం..!

calendar_today October 31, 2022
person dharshininews
సూట్‌కేస్‌లో మృతదేహం..!
సూట్‌కేస్‌లో మృతదేహం..! - 10 ఏళ్ల బాలుడి అదృశ్యం విషాధాంతం - గుప్తనిధుల కోసం బలి అంటూ పుకారు - కోడంగల్‌లో కలకలం రేపిన ఘటన వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి: ముళ్ల పొదల్లో పడేసిన సూట్‌కేస్‌లో పదేళ్ల బాలుడి మృతదేహం లభ్యమయ్యింది. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా కోడంగల్‌ పట్టణ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సూట్‌కేస్‌లోని మృతదేహం ఇటీవలే అదృశ్యమైన బాలుడిదిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన బాలుడు రజా ఖాన్ శనివారం సాయంత్రం నుంచి కనిపిచంకుండా పోయాడు. చుట్టపక్కల వెతికిన తల్లిదండ్రులు తెలిసిన వారు లేదా బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని భావించి ఆరా తీశారు. అయినా ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. సోమవారం ఉదయం ఎస్సీ హాస్టల్ ముందు ఓ సూటు కేసులో మృతదేహం కనిపించగా.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహం కనిపించకుండా పోయిన రజా ఖాన్‌గా గుర్తించారు. అయితే గుప్త నిధుల కోసమే బాలుడ్ని బలి ఇచ్చి ఉంటారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. అప్రమత్తమైన పోలీసులు కొడంగల్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదృశ్యమైన బాలుడు రజా ఖాన్‌ను హత్య చేయడంతో కోడంగల్‌లో కలకలం రేగింది.