schedule Sunday, July 05, 2026

పోలీసు వ్యవస్థ ప్రాముఖ్యమైంది

calendar_today October 27, 2022
person dharshininews
పోలీసు వ్యవస్థ ప్రాముఖ్యమైంది
పోలీసు వ్యవస్థ ప్రాముఖ్యమైంది - శాఖ పనితీరును తెలుసుకోవాలి - తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ - పట్టణ పోలీస్టేషన్‌లో ఓపెన్ హౌస్‌పై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో పోలీసు వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యమైనదని, ఆ శాఖపై విధులపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ అన్నారు. పోలీసు అమర వీరుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి ఆదేశాల మేరకు గురువారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ పై అవగాహన కల్పించారు. తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ సమక్షంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి విద్యార్థులకు పోలీసు విధులు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, కమ్యూనికేషన్ వ్యవస్థ, రికార్డుల నిర్వహణ, లాకప్ గదులు, సీసీ కెమెరాలు గురించి వివరించారు. అదేవిధంగా పోలీసు ఆయుధాల నిర్వహణ, సైబర్ క్రైమ్, షీటీం, డయల్ 100 పనితీరు తదితర అంశాల పై కూడ అవగాహన కల్పించారు. విద్యార్థులు పోలీసుల ఆయుధాలను చేతులో పట్టుకుని ఉత్తేజ పడ్డారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ కృషి చేస్తుందని, అందుకనే పోలీసు వ్యవస్థ ప్రాముఖ్యమైందని అన్నారు. విద్యార్థులు పోలీసు వ్యవస్థతో పాటు విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు వేణుగోపాల్ గౌడ్, మహిపాల్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.