schedule Sunday, July 05, 2026

పేకాట రాయుళ్ల‌పై టాస్క్‌పోర్స్ పోలీసుల దాడులు

calendar_today March 22, 2022
person dharshininews
పేకాట రాయుళ్ల‌పై టాస్క్‌పోర్స్ పోలీసుల దాడులు
పేకాట రాయుళ్ల‌పై టాస్క్‌పోర్స్ పోలీసుల దాడులు - 17 మందిని అదుపులోకి తీసుకుని పోలీసుల‌కు అప్ప‌గింత తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: పేకాట రాయుళ్ల‌పై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. మంగ‌ళ‌వారం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేర‌కు జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ వెంక‌టేశం బృందం తాండూరు మండలం నారాయణపూర్‌లో దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వ‌ద్ద నుంచి 10 బైకులు, 15 సెల్ ఫోన్లు, రూ.7660 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం పేకాట రాయుళ్ల‌ను కరణ్ కోట్ పోలీసుల‌కు అప్పగించారు. ఈ మేర‌కు వారిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు క‌ర‌ణ్ కోట్ పోలీసులు తెలిపారు.