schedule Sunday, July 05, 2026

అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటాం

calendar_today June 15, 2023
person dharshininews
అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటాం
అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటాం - రవాణాకు అనుమతులు ఇవ్వొద్దు - ద్వజమెత్తిన పాత తాండూరు వాసులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో అక్రమ ఇసుక రవాణాపై ప్రతి రోజూ విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు రెచ్చిపోయి దౌర్జన్యాలు ప్రదర్శించిన సంఘటనలు తాండూరు వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు కేంద్రంగా జరుగుతున్న వివాదంపై స్థానికులు ఏకమయ్యారు. పాత తాండూరు మీదుగా అక్రమ ఇసుక రవాణాను సాగనివ్వమని తేల్చి చెబుతున్నారు. ఇటీవల పాత తాండూరు వీఆర్ఏపై జరిగిన దాడి సంఘటనతో స్థానికులు అంతా ఏకమయ్యారు. తాజాగా బుధవారం రోజు రాత్రి ప్రత్యేక సమావేశం అయ్యారు. ఇకపై పాత తాండూరు మీదుగా ఇసుక అక్రమ రవాణాని అరికట్టేందుకు అందరు ఏకమై పోరాడాలని తీర్మానించుకున్నారు. అదేవిధంగా పాత తాండూరు కాగ్నా వాగు నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని సంబంధిత అధికారులను కోరారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే ఊరుకునేదిలేదని ధ్వజమెత్తారు. నియంత్రణకు ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్సీ యూత్ అధ్యక్షులు ఎం నవీన్ కుమార్, మాజీ కౌన్సిలర్ ముజీబ్ ఖాన్, వెంకటేష్, శ్రీనివాస్, నరహరి, సీనియర్ నాయకులు యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... https://dharshininews.com/17893 chaithany collage