schedule Saturday, September 12, 2026

సూపర్ పోలీస్..!

calendar_today May 28, 2023
person dharshininews
సూపర్ పోలీస్..!
సూపర్ పోలీస్..! - నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగ - చాకచక్యంగా పట్టుకున్న తాండూరు పోలీసులు - డీఎస్పీ చేతుల మీదుగా రివార్డులు తాండూరు, దర్శిని ప్రతినిధి: పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ధైర్య సాహాసాలతోనో.. లేదా చాకచక్య పనితీరుతోనే ఉన్నతాధికారుల నుంచి శభాష్‌ అనిపించుకుంటారు. తాండూరు పట్టణ పోలీసులు కూడా శభాష్‌ అంటూ కితాబు అందుకున్నారు. నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను పట్టుకుని రిమాండుకు తరలించారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం ఇందిరానగర్‌కు చెందిన సలీం లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఒకే నెంబర్ ప్లేటుతో రెండు, మూడు లారీలను నడపడంతో పాటు వాటిని దొంగతనంగా విక్రయించేవాడు. నాలుగేళ్ల క్రితం ఈ విషయంపై సలీంపై కేసు నమోదయ్యింది. అప్పట్లో రిమాండుకు కూడ తరలించారు. 2019 తరువాత నుంచి కోర్టుకు హాజరు కావాల్సిన సలీం తప్పించుకుని తిరుగుతున్నాడు. అతనిపై రెండు నెలలుగా నిఘా ఉంచిన పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. శనివారం కోర్టులో హాజరు పరిచి తిరిగి రిమాండుకు పంపించారు. నాలుగేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న దొంగను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడంపై ప్రశంసలు వెలువెత్తాయి. ఇందుకు గాను తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ చేతుల మీదుగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సమక్షంలో పోలీసు కానిస్టేబుళ్లు శివకుమార్, షాబిల్ పాష, సాయప్పలను అభినందించారు. అదేవిధంగా రివార్డులను కూడా అందజేశారు. మరోవైపు పోలీసు కానిస్టేబుళ్లను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అబ్దుల్ రవూఫ్‌, సిబ్బంది ఉన్నారు. chaithany collage