schedule Sunday, July 05, 2026

హెల్మెట్ ధరించే ప్రయాణించాలి

calendar_today May 22, 2023
person dharshininews
హెల్మెట్ ధరించే ప్రయాణించాలి
హెల్మెట్ ధరించే ప్రయాణించాలి - తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి - వాహనాల తనిఖీలో హెల్మెట్ పై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి: వాహనదారులు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ తప్పక ధరించాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సూచించారు. సోమవారం తాండూరు పట్టణం కొడంగల్ రోడ్డు మార్గంలో హెల్మెట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. వాహనాల తనిఖీ చేస్తూనే హెల్మెట్ ధరించని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. హెల్మెట్ వాడకంతో ఎన్నో లాభాలు ఉన్నాయని, వాహనాలు నడిపే సమయంలో వాహనదారలు తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు. అదేవిధంగా దాదాపు 30 మంది వాహనదారుల చేత కొత్తగా హెల్మెట్స్ ను కొనుగోలు చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ మహిపాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది కూడా చదవండి... స్కూల్లో బ్రేక్‌ ఫాస్ట్..! - సర్కారు బడులలో అమలు - వచ్చే ఏడాది నుంచి కొత్త మెను https://dharshininews.com/17189 chaithany collage