schedule Saturday, September 12, 2026

పెళ్లి చేయడం లేదని యువతి ఆత్మహత్య

calendar_today May 6, 2023
person dharshininews
పెళ్లి చేయడం లేదని యువతి ఆత్మహత్య
పెళ్లి చేయడం లేదని యువతి ఆత్మహత్య - గతంలో కూడా ఆత్మహత్యాయత్నం - తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లిలో ఘటన - కేసు నమోదు చేసిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయడం లేదని ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ అబ్దుల్ రావుఫ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం ఐదు నెలల క్రితం తాండూరు పట్టణంలోని మల్ రెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఇటుక బట్టీలో పనిచేసేందుకు వచ్చారు. ఆ కుటుంబంలోని దలిమో(19)కు వారి ప్రాంతానికి చెందిన మరో కుటుంబంలో ఉన్న యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబీకులు ప్రేమికుడితో పెళ్లి చేసేందుకు పెద్దలు ఆలస్యం చేస్తున్నారు. దీంతో మనస్థాపం చెందిన యువతి అక్కడ నివాసం ఉంటున్న గుడిసెలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన యువతి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు అబ్దుల్ రావుఫ్ తెలిపారు. అయితే మృతి చెందిన యువతి మానసిక పరిస్థితి బాగాలేదని, గతంలో కూడా రెండు.. మూడుసార్లు ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారని పోలీసులు వెల్లడించారు.