schedule Sunday, November 22, 2026

సేవారత్న శంకరన్నకు శుభాకాంక్షల వెల్లువ..!

calendar_today November 22, 2026
person dharshininews
సేవారత్న శంకరన్నకు శుభాకాంక్షల వెల్లువ..!
సేవారత్న శంకరన్నకు శుభాకాంక్షల వెల్లువ..! - ఆర్బీఓఎల్‌ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌ రెడ్డి అభినందనలు - పలువురు ప్రముఖుల ఆత్మీయ సత్కారాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారవేత్త, సాయిపుత్ర హోమ్స్‌ అధినేత బి. శంకర్‌ యాదవ్‌కు అంతర్జాతీయ సేవారత్న పురస్కారం లభించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గుర్తింపుపై హర్షం వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్బీఓఎల్‌ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌ రెడ్డి, జుంటుపల్లి అరవింద్‌ రెడ్డి, కురుమ సంఘం సభ్యులు పూజారి పాండు, హనుమయ్య, శివయ్య, జినుగుర్తి కురవ నర్సింలు, రాములు తదితరులు శంకర్‌ యాదవ్‌ను కలిసి అభినందించారు. అలాగే 28వ వార్డు కౌన్సిలర్‌ నాగారం మల్లేశం ఆధ్వర్యంలో శాంతినగర్‌ కాలనీకి చెందిన కోకట్‌ రూపేష్‌ కుమార్‌, ఆనంద్‌ శర్మ, వంశీకృష్ణ గౌడ్‌, రవీందర్‌ రెడ్డి, అగనూర్‌ సంకేత్‌, యాష్కీ రావి, శరత్‌ చంద్ర తదితరులతోపాటు ప్రముఖులు కలిసి ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేస్తూ తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శంకర్‌ యాదవ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం తాండూరుకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువవుతూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. https://www.dharshininews.com/45490/