పేదల కలలు.. కాంగ్రెస్ సాకారం..!
November 22, 2026
dharshininews
పేదల కలలు.. కాంగ్రెస్ సాకారం..!
- ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు హరిహర గౌడ్
- లబ్ధిదారులకు శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది ఎంతోమంది పేదల కలను సాకారం చేసే దిశగా సర్కారు కృషి చేస్తోందని తాండూరు కాంగ్రెస్ నాయకుడు హరిహర గౌడ్ అన్నారు.
సొంతింటిలోకి అడుగుపెట్టడం ప్రతి కుటుంబానికి జీవితంలో మధురమైన ఘట్టమని పేర్కొన్నారు.తాండూరు పట్టణంలోని 13వ వార్డు అయ్యప్ప నగర్‌లో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో కుమ్మరి నర్సింహ, కుమ్మరి నర్సింలు ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుకలకు హరిహర గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన గృహాల్లో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాదని, ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల కలలను కాంగ్రెస్ సర్కారు సాకారం చేస్తోందని అన్నారు. సొంతింటి కల నెరవేరిన కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు.
https://www.dharshininews.com/45485/