schedule Friday, November 06, 2026

బోధన్ ఎమ్మెల్యేతో బీఎస్ఆర్ భేటీ..!

calendar_today November 6, 2026
person dharshininews
బోధన్ ఎమ్మెల్యేతో బీఎస్ఆర్ భేటీ..!
బోధన్ ఎమ్మెల్యేతో బీఎస్ఆర్ భేటీ..! - రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని కలిసిన బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి - తాండూరు అభివృద్ధిపై చర్చ తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డితో ఆర్బీ ఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సుదర్శన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి, పట్టణం, నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా నెలకొన్న అవసరాలు, అభివృద్ధి అంశాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. https://www.dharshininews.com/45281/