ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి..!
November 4, 2026
dharshininews
ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి..!
- రూ.కోటి పరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలి
- ఘటన కారకులను శిక్షించాలి
- తాండూరులో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల తాండూరు ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, కార్మికులకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ తాండూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. గత నెల 26న బస్సులో జరిగిన ఘటనలో ప్రవళిక తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.
ఈ నేపథ్యంలో తాండూరు ఆర్టీసీ డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కార్మికులు ర్యాలీ చేపట్టారు. ప్రవళిక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డిపో గౌరవ అధ్యక్షుడు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రవళిక కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని, ఆమె తల్లికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు రక్షణ కల్పించడం యాజమాన్యం, ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్మికుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ బాలప్ప, డిపో అధ్యక్షుడు బస్వరాజ్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45273/