schedule Tuesday, November 03, 2026

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..!

calendar_today November 3, 2026
person dharshininews
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పొడిగింపు..! - కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం - అప్పటి వరకు దరఖాస్తుకు అవకాశం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలనుకునే వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు పట్టభద్రులు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు నుంచి డిసెంబర్‌ 10 వరకు జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. గడువు పొడిగింపుతో ఇప్పటివరకు నమోదు చేసుకోలేకపోయిన పట్టభద్రులకు మరో అవకాశం లభించింది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://www.dharshininews.com/45253/