schedule Tuesday, November 03, 2026

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి మధుసూదన్‌రావు?

calendar_today November 2, 2026
person dharshininews
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి మధుసూదన్‌రావు?
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి మధుసూదన్‌రావు? - రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర చర్చ - పోటీ చేయాలంటూ స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి విజ్ఞప్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి: పోలీసు అధికారిగా సుదీర్ఘకాలం సేవలందించిన రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ జి. మధుసూదన్‌రావు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవబోతున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన మధుసూదన్‌రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు, హితైషుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న విద్యార్హతలు, పోలీసు శాఖలో పనిచేసిన అనుభవం నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనను పలువురు ముందుకు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విజ్ఞప్తులపై మధుసూదన్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శ్రేయోభిలాషుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతారా? లేక తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకుంటే ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీ నుంచి అవకాశం కోరుతారా? లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అనే ప్రశ్నలు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మధుసూదన్‌రావు తన రాజకీయ ప్రవేశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన ఈ పేరు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. https://www.dharshininews.com/45247/