schedule Tuesday, November 03, 2026

ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి

calendar_today October 31, 2026
person dharshininews
ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి
ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి - రేపటి ‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’ నిరసన కోసం వెళ్లిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో నిర్వహిస్తున్న 'ఓటు బచావో.. దేశ్‌ బచావో’ ని నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలవాలని అన్నారు. ‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’ నినాదం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడమేనని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొని ఓటు హక్కు పరిరక్షణకు సంబంధించిన తమ గళాన్ని వినిపించనున్నట్లు పేర్కొన్నారు. https://www.dharshininews.com/45243/