నేటి నీటి పొదుపే.. రేపటికి భరోసా!
November 2, 2026
dharshininews
నేటి నీటి పొదుపే.. రేపటికి భరోసా!
- ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాలి
- మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
- తాండూరులో నీటి సంరక్షణపై అవగాహన
- విద్యార్థుల చైతన్య ర్యాలీ, అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి: నేటి నీటి పొదుపే రేపటికి భరోసా అందిస్తుందని పలువురు పెద్దలు పేర్కొన్నారు. సోమవారం నీటి పొదుపు, సంరక్షణపై అవగాహన కల్పిస్తూ మున్సిపాలిటీ పరిధిలో చైతన్య ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నీరు ప్రతి ఒక్కరి జీవనాధారమని, దాన్ని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
నేడు మనం ఆదా చేసే ప్రతి నీటి బొట్టు రేపటి తరాలకు ఎంతో విలువైనదని అన్నారు. నీటి కొరతను నివారించాలంటే ప్రతి ఇంటి నుంచే పొదుపు అలవాటు ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో విద్యార్థులు నీటి ప్రాముఖ్యతను చాటిచెబుతూ వివిధ నినాదాలు చేశారు. నీటిని వృథా చేయవద్దని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని ప్రజలకు సందేశమిచ్చారు.
చిన్నారుల నినాదాలు నీటి పొదుపుపై సామాజిక బాధ్యతను గుర్తుచేశాయి.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45249/