schedule Wednesday, November 04, 2026

ఓటు నమోదు పట్టభద్రుల బాధ్యత..!

calendar_today November 4, 2026
person dharshininews
ఓటు నమోదు పట్టభద్రుల బాధ్యత..!
ఓటు నమోదు పట్టభద్రుల బాధ్యత..! - గడువులోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలి - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి - పలు పాఠశాలల అధ్యాపకులతో సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ కోరారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, అధ్యాపకులతో వారు సమావేశమై ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించారు. హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సూచించారు. 2023 నవంబర్ 1వ తేదీకి ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. గతంలో ఓటు నమోదు చేసుకున్నవారు సైతం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్లోని అర్హులైన పట్టభద్రులకు సమాచారం అందించి వారిని కూడా ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగిస్తూ, నీటి వనరులను సంరక్షించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, అక్షర, విశ్వవేద, గంగోత్రి, నేతాజీ గురుదేవ్ గురుకుల్, రహ్మానియా, ఫ్రంట్‌లైన్, యునైటెడ్ పబ్లిక్, మార్నింగ్ స్టార్స్, సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్, సెయింట్ మేరీస్ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45271/