schedule Tuesday, November 03, 2026

జుంటుపల్లి రామస్వామికి రాజయోగం..!

calendar_today November 3, 2026
person dharshininews
జుంటుపల్లి రామస్వామికి రాజయోగం..!
జుంటుపల్లి రామస్వామికి రాజయోగం..! - దేవాలయ పునర్‌ నిర్మాణానికి నిధులు - ప్రభుత్వానికి రూ. 20 కోట్లతో ప్రతిపాదనలు - సానుకూల స్పందనపై నేతల హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని జుంటుపల్లి సీతారామ స్వామి దేవాలయానికి రాజయోగం రాబోతుందని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త, తాండూరు నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ కన్వీనర్‌ కరణం పురుషోత్తంరావు, దేవాలయ కమిటి సభ్యులు రాఘవేందర్ రావులు అన్నారు. మంగళవారం ఎండోమెంట్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన, సర్వే నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన పనులను గుర్తించి, అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పురుషోత్తం రావు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిలో భాగంగా మొత్తం 13 పనులు చేపట్టేందుకు దృష్టిసారించడం జరిగిందన్నారు. మొదటి విడతలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో అర్థ మంటపం, మహామంటపం, ఆంజనేయస్వామి ఆలయం, గోపురం, బలిపీఠం, తూర్పు రాజగోపురం తదితర నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. రెండో విడతలో మరో రూ.10 కోట్లతో ఆలయ కార్యాలయ గది, యాగశాల, వంటశాల, ద్వారాల నిర్మాణం, పడమర ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం తదితర అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో ఎస్డీఎఫ్‌ నిధులు మంజూరు చేయించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగిందన్నారు. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు అనంతరం పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ సర్వే కార్యక్రమంలో ఎండోమెంట్ శాఖ సిబ్బంది, ఈఓ నాయక్, ఇంజనీరింగ్ ఏఈ తులసీరాం, ఏవో శాంత్ కుమార్, పూజారి జోషి వాదిరాజ్, బి. వెంకట్ రెడ్డి, పి. అరవింద్ రెడ్డి, రాజకోటి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45263/