విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ..!
November 5, 2026
dharshininews
విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ..!
- తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.
గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
యూనిఫామ్‌ల పంపిణీ కేవలం దుస్తులు అందించడం మాత్రమే కాదని, విద్యార్థుల్లో సమానత్వం, ఆత్మగౌరవ భావనను పెంపొందించే కార్యక్రమమని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో చదువుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించడం వల్ల ఉదయం పౌష్టికాహారం తీసుకుని ఉత్సాహంగా తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయని వివరించారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవడంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, కళాశాలకు, తాండూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్ధుల్ రజాక్, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/45279/