schedule Saturday, September 05, 2026

పాత తాండూరులో త‌గ్గిన అతిసార

calendar_today December 7, 2021
person dharshininews
పాత తాండూరులో త‌గ్గిన అతిసార
పాత తాండూరులో త‌గ్గిన అతిసార - జిల్లాలో ఆసుప‌త్రిలో మూడు కేసులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి పాతతాండూరులో ప్రజల ఆరోగ్య పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. మొన్నటి వరకు భారీగా సమోదైన అతిసార కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం అతిసార కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ నెల మొదట్లో తాండూరులో భారీగా అతిసార కేసులు నమోదైన విషయం తెలిసిందే. వరసగా ఈనెల 1న 38, 2న 37, 3న 30 వరకు దాదాపుగా కేసులు నమోదయ్యాయి. అతిసార కేసులో ఒక్కసారి. పాత తాండూరు ఉలిక్కిపడింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్, మున్సిపల్ శాఖల అధికారులు రంగంలోకి దిగారు. అతిసార కేసుల నియంత్రణకు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పాత తాండూరులో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించారు. ఈ మేరకు పాత తాండూరులో కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 11 కేసులు ఉండగా అందులో మంగళవారం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి.