schedule Sunday, September 06, 2026

తాండూరులో జైపూర్, కెలిఫర్ అమరిక క్యాంపు

calendar_today March 9, 2024
person dharshininews
తాండూరులో జైపూర్, కెలిఫర్ అమరిక క్యాంపు
తాండూరులో జైపూర్, కెలిఫర్ అమరిక క్యాంపు - రిజిస్ట్రేషన్ చేసుకున్న వికలాంగులకు ఉచిత సేవలు - ప్రకటించిన మార్వాడి యువమంచ్ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వికలాంగులకు ఉచిత జైపూర్ కాళ్లు, కెలిఫర్ కాళ్ల అమరిక క్యాంపు నిర్వహిస్తున్నట్లు తాండూరు మామార్వాడి యువమంచ్ సభ్యులు తెలిపారు. మార్వాడి యువమంచ్, యాలాల మండలం జక్కెపల్లిలోని రాడికల్ బయో - ఆర్గానిక్ లిమిటెడ్ ఫ్యాకర్టీ సంయక్త ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13వ తేదిల్లో పట్టణంలోని బాలాజీ మందిరంలో క్యాంపు కొనసాగుతుందన్నారు. ముందుగా అంగవైకల్యం కలిగిన వికలాంగుల నుంచి కొలతలు తీసుకోవడం జరుగుతుందని, 200ల మందికి ఈ సేవలను అందించడం జరుగుతుందన్నారు. శిభిరానికి వచ్చే వికలాంగులు తమవెంట ఆధార్కార్డు, అంగవైకల్యం కలిగిన రెండు పాసో ఫోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకరావాల్సి ఉంటుందని సూచించారు. వికలాంగులు రిజిస్ట్రేషన్ కోసం బ్రిజ్ మోహన్ బూబ్(సెల్:9989495561), కిషన్ రాఠి(సెల్: 9885934446), అరుణ్‌ సర్డా(సెల్: 9948323044), కరణ్‌ జైన్(సెల్: 9885222511), సుధు పసారి(సెల్: 9885277560)లకు సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞఫ్తి చేశారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/24332/