schedule Friday, September 04, 2026

శనగలు శరీరానికి మేలు..!

calendar_today January 17, 2024
person dharshininews
శనగలు శరీరానికి మేలు..!
శనగలు శరీరానికి మేలు..! - నానబెట్టినవి తింటే ప్రయోజనాలెన్నో - మధుమేహా బాధితులకు ఉపయోగకరం దర్శిని ప్రతినిధి : శనగల్ని తినాలంటే అదో పెద్ద ప్రోసెస్ అనుకుంటారు కానీ.. శనగలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. నానబెట్టిన శనగలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. నానబెట్టిన శనగలు ఆరోగ్యంతోపాటు జుట్టుకు కూడా పోషణ ఇస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టును బలంగా, అందంగా చేస్తాయి. నానబెట్టిన శనగలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. నానబెట్టిన శనగల్లో ప్రోటీన్, సోడియం, కాల్షియం, ఫైబర్ ఉంటాయి. నీటిలో నానబెట్టిన శనగలు రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. చాలా మంది ఏడాది పొడవునా జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. ఇటువంటి వారు నానబెట్టిన శనగలు తింటే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంద ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ నానబెట్టిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. గుండె పదిలం.. నానబెట్టిన శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నానబెట్టిన శనగలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ శనగలు బరువును అదుపులో ఉంచుతుంది. ఫలితంగా నానబెట్టిన శనగలు తినడం వల్ల చాలా సేపు పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. నానబెట్టిన శనగలు జీర్ణక్రియకు సహాయపడుతుంది. మొలకెత్తిన శనగలు తింటే శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఒక గుప్పెడు నానబెట్టిన శనగలు తినడం అలవాటు చేసుకోండి. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23171/