schedule Monday, September 07, 2026

అమ్మకానికి బూడిద..!

calendar_today February 15, 2023
person dharshininews
అమ్మకానికి బూడిద..!
అమ్మకానికి బూడిద..! - కిలో రూ. 1800లు అంట - సోషల్‌ మీడియాలో వైరల్‌ దర్శిని డెస్క్‌: మన పూర్వికులు అప్పుడు వినియోగించిన వస్తువులు, పదార్దాలు, పద్దతులను మరిపించేందుకు ఎన్నో వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకవచ్చారు. అవి నవీన కాలంలో ఎన్నో రోగాలు, అవస్థలు తీసుకవస్తున్నాయని పలువులు విశదీకరిస్తున్న విషయాలను చూస్తున్నాం. పాత కాలంలో కట్టెల పొయ్యిపై ఆహారాన్ని వండటం వంట అంతా అయిపోయిన తరువాత.. కట్టెల పొయ్యిలో బూడిద మిగిలేది. దానిని పడేయడమో లేక గిన్నెలు శుభ్రం చేసేందుకో ఉపయోగించే వారు. ఇదే బూడిద ఇప్పుడు అమ్మకానికి పెట్టారంటే నమ్మశక్యం కాకుండా పోయింది. ప్రస్తుతం బూడిదకు సంబంధించిన ఓ పోస్ట్ ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది. బాబా రామ్‌దేవ్ ట్విట్టర్‌లో ఈ పోస్టు చేశారు. అమెజాన్ లో అమ్మకానికి ఉంచిన బూడిద ప్యాకెట్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో 250 గ్రాముల ఈ ప్యాకెట్ ధర రూ.450గా, అంటే దీని ప్రకారం, ఒకదాని ధర కిలో చుల్హా బూడిద రూ.1800. ఈ బూడిదను ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. బూడిదకు ఇంత ఎక్కువ ధర పలకడం చూసి బాబా రామ్‌దేవ్ కూడా ఆగ్రహానికి గురయ్యారు. మన పూర్వీకులు పాత్రలు కడగడానికి ఉపయోగించే పొయ్యి బూడిదను మొదట అశాస్త్రీయంగా పిలిచి ఎగతాళి చేశారు. క్యాన్సర్‌ వంటి వ్యాధులకు కారణమయ్యే రసాయనాల డిష్‌వాష్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారని మండిపడ్డారు. బాబా రామ్‌దేవ్ చేసిన ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 1 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. వేల సంఖ్యలో నెటిజన్లు పోస్ట్ ను లైక్ చేశారు. అంతే కాకుండా పోస్ట్ చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. जिस चूल्हे की राख से हमारे पूर्वज बर्तन मांजते थे, पहले उनको अवैज्ञानिक कहकर उसका मजाक बनाया गया. केमिकल वाले डिशवाश के प्रयोग की आदत डाली, जो कैंसर जैसी बीमारियों का कारण बना। आज वही चूल्हे की राख अमेज़न जैसी कंपनी 1800 रुपये किलो बेच रही है। pic.twitter.com/ucU6iQSm7g — स्वामी रामदेव (@yogrishiramdev) February 13, 2023