schedule Monday, September 07, 2026

మోడల్‌ స్కూళ్లలో చేరండి..!

calendar_today July 3, 2022
person dharshininews
మోడల్‌ స్కూళ్లలో చేరండి..!
మోడల్‌ స్కూళ్లలో చేరండి..! - ప్రారంభమైన ఇంట‌ర్‌ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌ - ఆన్‌లైన్‌లో 10వ తేది వ‌ర‌కు గ‌డువు హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఇంట‌ర్ మీడియ‌ట్ కోసం మోడ‌ల్ స్కూళ్ల‌లో చేరండి అంటూ ప్ర‌భుత్వం నోటీఫికేష‌న్ జారీ చేసింది. రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ఆంగ్ల మాధ్యమం ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్మీడియట్‌ విద్యలో భాగంగా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అడ్మిషన్ల కోసం ఈ నెల 2వ తేదీ నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు www.tsmodelschools.in అనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.