schedule Monday, September 07, 2026

రానున్న ఐదు రోజుల్లో వ‌ర్షాలు

calendar_today May 31, 2022
person dharshininews
రానున్న ఐదు రోజుల్లో వ‌ర్షాలు
రానున్న ఐదు రోజుల్లో వ‌ర్షాలు - జూన్ 5న రుతుప‌వ‌నాల రాక‌ హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: వారం పదిరోజుల కిందటే అకాల వర్షాలతో దేశం యావత్తూ తడిసి ముద్దయింది. వేసవి తాపం నుంచి కాస్తంత ఉపశమనం దొరికింది. ఇప్పుడు నైరుతి రుతుపవనం కూడా వచ్చెయ్యడంతో.. మళ్లీ వర్షాలు కురవబోతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 5న తెలంగాణకు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. “జూన్ 5న తెలంగాణలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి” అని పెర్కోంది. “ఉదయం ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతుంటాయి. తెలంగాణలో రుతుపవనాలు జూన్ 5 లేదా 6 న పురోగమిస్తాయి. ఈ సారి నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం చూపిస్తుంద‌ని శాస్త్రవేత్త‌లు అంటున్నారు. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వ‌ర్షాలు కురుస్తాయ‌ని చెబుతున్నారు. జులై మాసంలో అధిక వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉద‌ని ఐఎండీ సంస్థ వెల్ల‌డించింది. ఆ త‌రువాత సాధార‌ణ వ‌ర్షాలు ఉంటాయ‌ని పేర్కొంది.