schedule Friday, September 04, 2026

మూడురోజులు వ‌ర్షాలు

calendar_today May 8, 2022
person dharshininews
మూడురోజులు వ‌ర్షాలు
మూడురోజులు వ‌ర్షాలు - వెల్ల‌డించిన వాతావ‌ర‌ణ శాఖ హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, విదర్భ నుంచి కర్నాటక వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడిందని చెప్పింది. రాగల 12 గంటల్లో తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం వెల్లడించింది.