schedule Monday, September 07, 2026

పోలీసు కోలువుల జాత‌ర షురూ..!

calendar_today April 25, 2022
person dharshininews
పోలీసు కోలువుల జాత‌ర షురూ..!
పోలీసు కోలువుల జాత‌ర షురూ..! - నోటిఫికేష‌న్‌ జారీ చేసిన ప్ర‌భుత్వం  - మే 2నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: పోలీసు ఉద్యోగాల కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న అభ్య‌ర్థుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ప్ర‌భుత్వండ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు భ‌ర్తిచేస్తున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో స్ప‌ష్టం చేసింది. ఈ నోఇందులో 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అయితే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నట్లు వెల్ల‌డించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌తో పాటు త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు. ఎస్ఐ పోస్టుల వివ‌రాలు సివిల్ ఎస్ఐలు -414 ఏఆర్ ఎస్ఐలు -66 ఎస్ఏఆర్ సీపీఎల్ ఎస్ఐలు -05 టీఎస్ఎస్‌పీ ఎస్ఐలు -23 స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఎస్ఐలు -12 విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -26 జైళ్ల శాఖ -08 ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్ ఎస్ఐలు -22 పోలీసు ట్రాన్స్‌పోర్ట్ ఆర్గ‌నైజేష‌న్ – -3 ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐలు -08 కానిస్టేబుల్ పోస్టుల వివ‌రాలు.. సివిల్ కానిస్టేబుల్స్ -4965 ఏఆర్ కానిస్టేబుల్స్ – 4423 ఎస్ఏఆర్ సీఎల్ – 100 టీఎస్ఎస్‌పీ – 5010 స్టేట్ స్పెష‌ల్ పోలీసు ఫోర్స్ – 390 విప‌త్తు నిర్వ‌హ‌ణ, అగ్నిమాప‌క శాఖ -610 జైళ్ల శాఖ(పురుషులు) – 136 జైళ్ల శాఖ(స్త్రీలు )-10 ఐటీ, క‌మ్యూనికేష‌న్ -262 పోలీసు కానిస్టేబుల్ (మెకానిక్)-21 పోలీసు కానిస్టేబుల్ (డ్రైవ‌ర్) -100