schedule Saturday, September 05, 2026

చలివేంద్రాలతో గొప్ప సేవ

calendar_today April 6, 2022
person dharshininews
చలివేంద్రాలతో గొప్ప సేవ
చలివేంద్రాలతో గొప్ప సేవ - ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్ర‌తినిధి : వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం గొప్ప సేవ అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త తల్లి స్వ‌ర్గీయ తాటికొండ మందాకిని స్మారకార్థం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తి చలివేంద్రాలతోనే తీరుతుందన్నారు. స్వర్గీయ మందాకిని గారి స్మారకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు. పట్లోళ్ల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల‌ తదితరులు పాల్గొన్నారు.