schedule Monday, September 07, 2026

తిరుమ‌ల భ‌క్తుల‌కు శుభ‌వార్త‌

calendar_today March 18, 2022
person dharshininews
తిరుమ‌ల భ‌క్తుల‌కు శుభ‌వార్త‌
తిరుమ‌ల భ‌క్తుల‌కు శుభ‌వార్త‌ - వ‌చ్చేనెల 1నుంచి అర్జిత సేవ‌ల‌కు అనుమ‌తి ద‌ర్శిని డెస్క్: తిరుమల శ్రీవారి భక్తుల‌కు దేవాస్థాన క‌మిటి శుభ‌వార్త‌ను చెప్పింది. వ‌చ్చేనెల‌ ఏప్రిల్ 1 నుంచి అర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. కోవిడ్ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఆల‌యానికి భ‌క్తులు పొటెత్త‌డం పెరిగింది. కొవిడ్ నేపథ్యంలో 2020 మార్చి నుంచి భక్తులను అనుమతించకుండా ఏకాంతంగా అర్జిత సేవలు. నిర్వహిస్తున్నారు. తాజాగా భక్తులకు అర్జిత సేవ‌లకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్న‌ట్లు క‌మిటి వెల్ల‌డించింది. అదేవిధంగా సుప్రభాతం, తోమాల, అర్చన, ఆష్టాదశపాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ల్యాట‌రీ విధానంలో కేటాయిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ సేవలను బుక్ చేసుకునేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 22వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని స్ప‌ష్టం చేసింది. టికెట్లు పొందిన వారు రెండ్రోజుల్లో టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. Mirapathalek. op gri.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.