schedule Sunday, September 06, 2026

ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్షా తేదిల్లో మార్పు

calendar_today March 16, 2022
person dharshininews
ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్షా తేదిల్లో మార్పు
ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్షా తేదిల్లో మార్పు - కొత్త షెడ్యూల్‌ను ప్ర‌క‌టించిన విద్యాశాఖ ద‌ర్శిని డెస్క్ : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌లో విద్యాశాఖ కొత్త మార్పుల‌ను చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం కొత్త షెడ్యూల్‌ల‌ను ప్ర‌క‌టించింది. ముందుగా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. వ‌చ్చే మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. మే 6, 9, 11, 13, 16, 18, 20, 23 తేదీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా.. మే 7, 10, 13, 14, 17, 19, 21, 24 తేదీల్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. అదేవిధంగా మే 23 నుంచి 28 వరకు ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జ‌ర‌గుతుండుగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు. అధికారులు విడుద‌ల చేసిన కొత్త షెడ్యూల్ ఈ కింద విధంగా ఉన్నాయి.