శ్వాస సమస్యలకు దివ్యౌషధం..!
February 22, 2022
dharshininews
శ్వాస సమస్యలకు దివ్యౌషధం..!
- పుదీనాతో ఆరోగ్య ప్రయోజనాలు
- జలుబు, గొంతునొప్పి మటుమాయం
దర్శిని ఆరోగ్యం : తరచూ వంటల్లో పుదీనాతో మనిషి ఆరోగ్యం ముడిపడి ఉంది. పలు రకాల ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషదంలా పనిచేసే పుదీనా ఉపయోగించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. పుదీనా ఆకులను తరచూ ఆహారంలో తీసుకోవడంవల్ల కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో వికారంగా అనిపించినప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. శ్వాస సంబంధమైన సమస్యలకు కూడా పుదీనా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి, దాంట్లో నాలుగైదు చుక్కల పుదీనా నూనె వేసి ఆవిరి పట్టుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. పుదీనా అలర్జీ, ఉబ్బసం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే పుదీనాను తరచూ కూరల్లో ఉపయోగించాలి. అదేవిధంగా అచ్చం పుదీనాను పచ్చడి రూపంలో కూడా తీసుకోవచ్చు. పుదీనా టీ తాగడం ద్వారా జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఇక పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పుదీనా ఆకులను తరచూ నమలడంవల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ మూలకాలు, సీ, డీ, ఈ, బీ విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు.