schedule Friday, September 04, 2026

తాండూరులో 26 క‌రోనా కేసులు

calendar_today January 14, 2022
person dharshininews
తాండూరులో 26 క‌రోనా కేసులు
రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు - తాండూరులో 26 కేసులు నమోదు - జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి : వైద్యుల సూచ‌న తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఈ యేడాది తాండూరులో కరోనా కేసుల న‌మోదు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. మొన్న బుధవారం 9 కేసులు నమోదు కాగా గురువారం 22 కేసులు నమోదయిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 105 మందికి పరీక్షలు నిర్వహించగా 26 కేసులు నమోదైనట్లు ఆసుపత్రి పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్ తెలిపారు. తాండూరులో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటిస్తూ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు. చిన్నారులు, పెద్దలు అర్హులైన వారంతా కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏండ్లు నిండిన వృద్ధులు బూస్టర్ డోస్ తప్పక తీసుకోవాలన్నారు. వ్యాక్సీనేషన్ పూర్తి చేసుకున్నప్పటికీ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.