schedule Tuesday, November 03, 2026

తాండూరులో పారిశుధ్య సమస్యపై ఎమ్మెల్యే చొరవ..!

calendar_today October 30, 2026
person dharshininews
తాండూరులో పారిశుధ్య సమస్యపై ఎమ్మెల్యే చొరవ..!
తాండూరులో పారిశుధ్య సమస్యపై ఎమ్మెల్యే చొరవ..! - పోట్లి మహారాజ్‌ కాంప్లెక్స్‌, గాంధీనగర్‌లో చెత్త తొలగింపు - కదిలిన మున్సిపల్‌ యంత్రాంగం తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణ పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అధికారులకు సూచించారు. పట్టణంలో నిర్వహించిన మార్నింగ్‌ వాక్‌ సందర్భంగా పోట్లి మహారాజ్‌ కాంప్లెక్స్‌ ముందు, గాంధీనగర్‌లోని అంగన్‌వాడీ పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఆయన స్థానికుల ద్వారా గుర్తించారు. వెంటనే వాటిని తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మార్నింగ్‌ వాక్‌లో భాగంగా ఎమ్మెల్యే ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి, చెత్త పేరుకుపోవడంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్‌ సిబ్బంది వెంటనే స్పందించి రెండు ప్రాంతాల్లో చెత్తను తొలగించి శుభ్రత పనులు చేపట్టారు. చాలాకాలంగా కొనసాగుతున్న సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. సమస్యపై చొరవ చూపి పరిష్కారానికి ఆదేశించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. https://www.dharshininews.com/45228/