schedule Tuesday, November 03, 2026

ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తప్పులు జరగొద్దు..!

calendar_today October 29, 2026
person dharshininews
ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తప్పులు జరగొద్దు..!
ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తప్పులు జరగొద్దు..! - పొరపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ - పారదర్శకంగా ఓటు నమోదు దరఖాస్తుల పరిశీలన - సాఫ్ట్‌ వేర్‌లో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి - తాండూరు ఆర్డీఓ అనిత తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని తాండూరు ఆర్డీఓ అనిత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫారం–18 ద్వారా అందిన దరఖాస్తులను వేగంగా, పారదర్శకంగా పరిశీలించి అర్హులైన పట్టభద్రుల వివరాలను నిబంధనల ప్రకారం ధ్రువీకరించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ప్రతిరోజూ కనీసం 10 శాతం దరఖాస్తులను తనిఖీ చేయాలని, ప్రక్రియ పూర్తయిన వాటిని సంబంధిత ఏఈఆర్‌ఓ కార్యాలయానికి పంపించాలని తెలిపారు. భౌతికంగా స్వీకరించిన ఫారం–18 దరఖాస్తులను రిజిస్టర్‌లో నమోదు చేసి, అదే రోజు సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో డిజిటలైజేషన్‌ చేయాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, నిర్ణీత గడువులోగా పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ అనిత సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం పాటించడం ద్వారా అర్హులైన పట్టభద్రుల వివరాలు సక్రమంగా నమోదు కావాలని పేర్కొన్నారు. https://www.dharshininews.com/45222/