schedule Tuesday, November 03, 2026

మనుషులు కాదు.. మానవ మృగాలు..!

calendar_today October 27, 2026
person dharshininews
మనుషులు కాదు.. మానవ మృగాలు..!
మనుషులు కాదు.. మానవ మృగాలు..! - మైనర్ బాలికపై తండ్రి కానీ తండ్రి ఘాతుకం - నాలుగేళ్లుగా లైంగిక దాడి - మరో ఇద్దరు కామాంధుల పైశాచికం - తెలిసినా నోరు మెదపని తల్లి - బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన - నిందితులను రిమాండ్ చేసిన తాండూరు పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మైనర్‌ బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక దాడులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన వికారాబాద్‌ జిల్లా పరిధిలో కలకలం రేపింది. వివిధ ప్రాంతాల్లో నివసించిన సమయంలోనూ బాలికపై మృగాళ్లలా అఘాయిత్యాలు పాల్పడినట్లు బయటపడింది. తాండూరు పోలీస్టేషనలో కేసు నమోదుతో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పరమేశ్వర్‌ గౌడ్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కోసిగి మండలం ఎరుపుమల్ల గ్రామానికి చెందిన నాగమ్మ భర్త మరణించిన తర్వాత తన కుమార్తెను పెంచుకుంటూ కూలి పనులు చేసేది. ఈ క్రమంలో అదే గ్రామానికి అల్లుడు అయిన లక్ష్మీ ప్రసన్నకుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కరోనా సమయంలో పూడూరు మండలం ఎన్కేపల్లి గ్రామంలోని మామిడి తోటలో పనిచేస్తున్నప్పుడు బాలిక(అప్పుడు 8ఏండ్లు)పై లక్ష్మీ ప్రసన్నకుమార్‌ లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సమయంలో అదే ప్రాంతంలో పనిచేస్తున్న కృష్ణ కూడా బాలికపై దాడికి పాల్పడినట్లు విచారణలో తెలిసింది. తాండూరులోనూ వేధింపులు 2022లో తాండూరుకు వచ్చి గొల్ల చెరువు సమీపంలో అద్దెకు నివసించిన సమయంలో, అదే ఇంట్లో మరో గదిలో ఉంటున్న మిట్టబాస్పల్లి గ్రామానికి చెందిన అమృతప్ప బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో వెల్లడైంది. అనంతరం నాగమ్మ, లక్ష్మీ ప్రసన్న కుమార్‌లు కూతురుతో కలిసి గత యేడాది 2025లో కుటుంబం యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లికి వెళ్లినట్లు సమాచారం. బాలిక అక్కడే యాదగిరిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. వెలుగులోకి వచ్చింది ఇలా బాలిక ఇటీవల పాఠశాలకు వెళ్లిన సమయంలో అనారోగ్యానికి గురికావడంతో ఉపాధ్యాయులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో బాలిక తనపై జరిగిన అఘాయిత్యాల గురించి వెల్లడించింది. ఉపాధ్యాయులు విషయాన్ని బాలల పరిరక్షణ కమిటీకి తెలియజేయగా, వారి సహకారంతో బాలిక యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తొలుత జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును తాండూరు పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్‌ గౌడ్‌ వెల్లడించారు. https://www.dharshininews.com/45205/