schedule Tuesday, November 03, 2026

ఎముకల నొప్పులకు చెక్‌..!

calendar_today October 25, 2026
person dharshininews
ఎముకల నొప్పులకు చెక్‌..!
ఎముకల నొప్పులకు చెక్‌..! - తాండూరు ఆదిత్య ఆసుపత్రిలో ఉచిత కన్సల్టెన్సీ క్యాంపు - ఈ నెల 27న నిర్వహణ - మోకాళ్లు, తుంటి, భుజాలు, వెన్నెముక సమస్యలకు నిపుణుల పరీక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సలహాలు అందించేందుకు తాండూరులోని అదిత్య ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్‌ కన్సల్టెన్సీ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయిపూర్‌ రోడ్డులోని అదిత్య ఆస్పత్రిలో ఈ శిబిరం జరగనుంది. ఈ శిబిరంలో యశోద ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌, ట్రామా, ఆర్థ్రోస్కోపీ, రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ లోకేశ్‌ కుమార్‌ గుప్తా, ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ ఎం. పాండురంగ వైద్య సలహాలు అందించనున్నారు. ట్రామా, అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన నిపుణుల సూచనలు కూడా అందుబాటులో ఉంటాయి. మోకాళ్లు, తుంటి నొప్పులు, భుజాలు, వెన్నెముక సమస్యలు, ఇతర ఎముకలు, కీళ్ల వ్యాధులు, వెన్నెముక వంకర, నడవడంలో ఇబ్బందులు, వైకల్య సమస్యలు, పుట్టుకతో వచ్చే క్లబ్‌ఫుట్‌ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ శిబిరాన్ని వినియోగించుకోవచ్చు. ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన వివరాల కోసం 9493684848, 9391198408 నంబర్లను సంప్రదించవచ్చని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. ఎముకలు, కీళ్ల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://www.dharshininews.com/45174/