schedule Tuesday, November 03, 2026

దసరా వేళ ఇంటికి వచ్చాడు..!

calendar_today October 19, 2026
person dharshininews
దసరా వేళ ఇంటికి వచ్చాడు..!
దసరా వేళ ఇంటికి వచ్చాడు..! - అంతలోనే అంతులేని విషాదం - లక్ష్మీనారాయణపూర్‌లో ఆర్మీ జవాన్‌ బోయిని మల్లేశం మృతి - ఆరు నెలల క్రితమే వివాహం, కుటుంబంలో తీరని విషాదం తాండూరు, దర్శిని ప్రతినిధి: పండుగ పూట ఇంట్లో ఆనందంగా గడపాల్సిన వేళ ఆ కుటుంబాన్ని తీరని విషాదం చుట్టుముట్టింది. దసరా పండుగ కోసం సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్‌ బోయిని మల్లేశం మృతి చెందడంతో లక్ష్మీనారాయణపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాల్సిన జవాన్‌ ఇక లేడన్న వార్తతో బంధువులు, గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరు నెలల క్రితమే వివాహం.. బోయిని మల్లేశంకు ఆరు నెలల క్రితమే వివాహమైంది. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన ఆయన సోమవారం రోజంతా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపినట్లు తెలిసింది. రాత్రి బెడ్రూంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబంలో తీరని శోకం.. కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన జవాన్‌ అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కొద్ది నెలలకే ఈ విషాదం చోటుచేసుకోవడం బంధువులను కలచివేసింది. పండుగ వేళ సందడితో ఉండాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. Pvr https://www.dharshininews.com/45147/