schedule Thursday, November 05, 2026

కోట్ పల్లి మార్కెట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి

calendar_today October 3, 2026
person dharshininews
కోట్ పల్లి మార్కెట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి
కోట్ పల్లి మార్కెట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి - గతంలో పెద్దేముల్‌ వైస్‌ ఎంపీపీగా సేవలు.. - తాజాగా మరో కీలక పదవి - ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కోట్ పల్లి మార్కెట్‌ కమిటి వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి నియమితులయ్యారు. శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో పెద్దేముల్‌ మండల వైస్‌ ఎంపీపీగా పనిచేసిన ఆమెకు తాజాగా మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌ గా కీలక పదవి అప్పగించారు. ఈ సందర్భంగా మధులత శ్రీనివాసచారి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి, రైతులు మరియు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. https://www.dharshininews.com/44947/