schedule Monday, September 14, 2026

ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు

calendar_today September 14, 2026
person dharshininews
ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు
ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక ఉత్సవాలు - శ్రీరామ మందిరంలో వైభవంగా తొలి పూజా కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని శ్రీరామ మందిరంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి తొలి పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వినాయక చవితిని పురస్కరించుకొని శ్రీరామ మందిరంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు గణపతి నామస్మరణతో మార్మోగాయి. ఉత్సవాల్లో స్థానిక భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. రానున్న రోజుల్లోనూ కమిటీ ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. https://www.dharshininews.com/44704/