schedule Sunday, September 13, 2026

వినాయక మండపాలకు కొత్త నెంబర్లు సిద్దం

calendar_today September 13, 2026
person dharshininews
వినాయక మండపాలకు కొత్త నెంబర్లు సిద్దం
వినాయక మండపాలకు కొత్త నెంబర్లు సిద్దం - కమిటి సభ్యులు తీసుకోవాలని విజ్ఞప్తి - సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరుపుకుంటున్న వినాయక ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసుకుంటున్న మండపాలకు నెంబర్లను కేటాయించడం జరుగుతుందని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు తెలిపారు. ప్రతి యేడాది ఏర్పాటు చేసే వినాయక మండపాలకు హిందూ ఉత్సవ సమితి తరుపున నెంబర్లు కేటాయించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి ఏర్పాటు చేస్తున్న మండపాలకు నెంబర్లను సిద్దం చేయడం జరిగిందని బిడ్కర్ రఘు తెలిపారు. వినాయకులను ప్రతిష్టించే కమిటి నిర్వహకులు తమ మండపాలకు సంబంధించిన నెంబర్లు తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి కార్యాలయంలో నెంబర్లను ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కమిటిల నిర్వహకులు తమ పాత నెంబర్లను తీసుకవచ్చి.. కొత్త నెంబర్లను తీసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేందుకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. https://www.dharshininews.com/44674/