schedule Saturday, September 12, 2026

గణేష్ నిమజ్జనంకు విఘ్నాలు దూరం..!

calendar_today September 12, 2026
person dharshininews
గణేష్ నిమజ్జనంకు విఘ్నాలు దూరం..!
గణేష్ నిమజ్జనంకు విఘ్నాలు దూరం..! - కోకట్ కాగ్న వాగులోనే విసర్జనం - గ్రామ పెద్దలతో హిందూ ఉత్సవ సమితి చర్చలు సఫలం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వినాయక నిమజ్జన వేడుకలకు ఏర్పడిన విఘ్నాలు తొలగి పోయాయి. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా యాలల మండలం కోకట్ కాగ్న వాగులోనే విసర్జనం నిర్వహించేందుకు నిర్ణయించారు. గత కొన్ని రోజులుగా కోకట్ గ్రామ పెద్దలు కాగ్న వాగులో వినాయకులను నిమజ్జనం చేసేందుకు అభ్యంతరం తెలిపారు. పీఓపీ, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం జరుగుతుందని, నిమజ్జనం తరువాత వివిధ పనులు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అభ్యంతరం తెలిపారు. తాజాగా శనివారం తాండూరు హిందూ ఉత్సవ సమితి సభ్యులు కోకట్ గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. గ్రామస్తుల డిమాండ్లపై సానుకూలత తెలుపుతూ.. నిమజ్జనం తరువాత పనులపై బాధ్యత తీసుకుంటామని భరోసా అందించారు. ఇందుకు గ్రామస్తులు అంగీకరించడంతో గణేష్ నిమజ్జనంకు విఘ్నాలు దూరం అయ్యాయి. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం కోకట్ కాగ్న వాగులోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహకరించిన కోకట్ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, కోకట్ గ్రామ పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/44653/