schedule Thursday, September 03, 2026

హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక

calendar_today September 1, 2026
person dharshininews
హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక
హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక - అధ్యక్షులుగా పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి - ప్రధాన కార్యదర్శిగా బిడ్కర్ రఘు, కోశాధికారిగా అంతారం కిరణ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎనీకయ్యింది. మంగళవారం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితి ఆనవాయితీ ప్రకారం సమితి నూతన అధ్యక్షురాలుగా మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డిను, గౌరవాధ్యక్షులుగా ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బిడ్కర్ రఘు, కోశాధికారిగా అంతారం కిరణ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా కార్యవర్గంను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా, నిర్విఘ్నంగా నిర్వహించాలని అన్నారు. హెచ్చులు, హంగామాలకు పోకుండా.. పండగను జరుపుకోవాలని అన్నారు. ఉత్సవ కమిటి సభ్యులు అందరు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44491/