schedule Thursday, September 03, 2026

రొంపల్లికి సీఎం హామీ..!

calendar_today August 30, 2026
person dharshininews
రొంపల్లికి సీఎం హామీ..!
రొంపల్లికి సీఎం హామీ..! - నామినేటెడ్‌ కార్పొరేషన్‌ పదవీలో ఛాన్స్ - ఎమ్మెల్యే సమక్షంలో కలిసిన సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్‌ రాజకీయాల్లో యువనేత రొంపల్లి సంతోష్‌కుమార్‌కు రాష్ట్ర  స్థాయిలో కీలక అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని నామినేటెడ్‌ కార్పొరేషన్‌ పదవుల్లో సంతోష్‌కుమార్‌కు అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రొంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సమక్షంలో రొంపల్లి సంతోష్‌కుమార్‌ను ముందుగా ఎంపీ వేం నరేందర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్‌ పార్టీ కోసం చేస్తున్న సేవలు, తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి అందిస్తున్న సహకారం గురించి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. కాంగ్రెస్‌ పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న సంతోష్‌కుమార్‌కు నామినేటెడ్‌ కార్పొరేషన్‌ పదవుల్లో అవకాశం కల్పించాలని వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలిసింది. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి, తగిన సమయంలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సంతోష్ కుమార్ తెలిపారు. సీఎం హామీతో రొంపల్లి సంతోష్‌కుమార్‌ కు ఏం పదవి ఇస్తారో అని ఆసక్తి నెలకొంది. https://www.dharshininews.com/44438/