schedule Thursday, September 03, 2026

మిలాద్‌ ఉన్ నబీలో మతసామరస్యం

calendar_today August 26, 2026
person dharshininews
మిలాద్‌ ఉన్ నబీలో మతసామరస్యం
మిలాద్‌ ఉన్ నబీలో మతసామరస్యం - పాత తాండూరులో ఘనంగా వేడుకలు - హాజరైన బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత తాండూరులో మిలాద్‌ ఉన్ నబీ వేడుకలలో మత సామరస్యత వెల్లివిరిసింది. బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి పండుగ సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంజీవ్ రావు, సంతోష్ గౌడ్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాండూరులో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను సోదరభావంతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పట్టణంలో కొనసాగుతున్న మతసామరస్యం, ఐక్యత భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. మిలాద్‌ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44371/